వేదన్యూస్ – డార్జిలింగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ శ్రీలీల కు చేదు అనుభవం ఎదురైంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీస్తూ కార్తీక్ ఆర్యన్ హీరోగా.. అనురాగ్ బసు దర్శలత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు డార్జిలింగ్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ రోజు చిత్రీకరణ భాగం పూర్తి చేసుకుని అక్కడ నుండి హీరో కార్తీక్ …హీరోయిన్ శ్రీలీల వెళ్తున్నారు. అక్కడకి చేరుకున్న భారీ జనసందోహాంలో నుండి వెళ్తుండంగా కొంతమంది అకతాయులు శ్రీలీల చేయి పట్టుకుని వెనక్కి లాగేసుకున్నారు.
పక్కనే హీరోతో పాటు చిత్రం యూనిట్.. బాడీ గార్డులు ఉన్న కానీ కొంతమంది అకతాయిలు ఒక్కసారి శ్రీలీల చేయిని పట్టుకుని వెనక్కి లాగుతూ కొంచెం దూరం తీసుకెళ్లారు. వెంటనే తేరుకున్న హీరో.. బాడీ గార్డులు వారి చెర నుండి రక్షించి అక్కడ నుండి అమ్మడుని పంపించేశారు. ఒక్కసారిగా జరిగిన ఈసంఘటనతో అందరూ అవాక్కయ్యారు.