Benifitsof Drumsticks

ఏ విందు కార్యక్రమైన సాంబారు చేసినప్పుడు దానిలో ములక్కాయలు.. దోసకాయలు.. సొరకాయలు వేయడం మనం చూస్తూ ఉంటాము.సాంబారు వేయించుకునేటప్పుడు వీటన్నింటిలో మునక్కాయ ముక్కలు వేయమని అడిగి మరి వేయించుకుంటాము. అంతగా ఇష్టపడతాము మనం.

మరి అలాంటి ములక్కాయ కూర వల్ల లాభాలు ఏంటో తెలిస్తే అసలు వదిలిపెడతారా..?. అయితే ఇప్పుడు లాభాలు ఏంటో తెలుసుకుందాము.ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సీజనల్ గా వచ్చే ఇన్ ఫెక్షన్లను నియంత్రిస్తాయి.

ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలను నియంత్రించడంలో ఇవి ఉపయోగపడతాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. మగవారిలో శృంగార సామార్ధ్యాన్ని పెంచుతాయి. అయితే వీటిలో ఉండే జింక్ ఆడవారికి నెలసరి క్రమంగా వచ్చేలా దోహదపడతాయి.