వేదన్యూస్ – నార్సింగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఓ టైప్. వాళ్లు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటారు. నిన్నటి దాక గమ్మున ఉన్న మంచు కుటుంబం మళ్లీ సరికొత్త వివాదంతో వార్తల్లోకెక్కారు. మా అధ్యక్షుడు.. ప్రముఖ హీరో మంచు విష్ణు తన ఇల్లు ధ్వంసం చేశారని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అతని సోదరుడు .. హీరో మంచు మనోజ్ పిర్యాదు చేశారు.
తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తమ కుటుంబం అంతా రాజస్థాన్ కెళ్లాము. మేము లేని సమయం చూస్కోని మా ఇంటిపైకి దాడి దిగారు.
ఈ దాడిలో ఇంటిని ధ్వంసం చేశారు. కారుతో పాటు విలువైన వస్తువులను మంచు విష్ణు దొంగిలించారని ఆ పిర్యాదులో మనోజ్ తెలిపారు. అయితే ఈ వివాదంపై తన తండ్రి మంచు మోహాన్ బాబు తో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఎంత ప్రయత్నం చేసిన అతను అందుబాటులోకి రాలేదని చెప్పడం విశేషం.