•  ఖాకీల పెట్రోలింగ్ పెంచాలి
  • ముసుగు దొంగలను వెంటనే పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి: ప్రజలు

వేద న్యూస్, మెట్ పల్లి  ప్రతినిధి:

మెట్‌పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ స్కూల్ ప్రాంతంలో ముసుగు దొంగలు తిరుగుతున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే సోమవారం అర్ధరాత్రి ఒకరి ఇంట్లోని సీ సీ కెమెరా లో ముసుగు దొంగలు తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో ముసుగు దొంగలు కనిపించారు.

ఈ వీడియో వైరల్ గా మరడం తో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ లు పెట్రోలింగ్ పెంచి ముసుగు దొంగలను తొందరగా పట్టుకొవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజల రక్షణకు తగు చర్యలు వెంటనే పోలీసులు తీసుకోవాలని రిక్వెస్టు చేస్తున్నారు.