వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:
వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో తిరుపతమ్మ గోపయ్య దేవాలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తిరుపతమ్మ గోపయ్య దేవాలయం నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. త్వరలో టెంపుల్ ప్రతిష్ట కోసం సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా సోమవారం ఉదయం గుడి ముందు గ్రామ పెద్దల సమక్షంలో దేవాలయ ప్రతిష్ట సమావేశం నిర్వహించనున్నట్టు దేవాలయ రూపకర్త ఎలగపల్లి లక్ష్మీ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మీటింగ్ కు గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని దేవాలయ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు.