వేద న్యూస్, వరంగల్ :
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నగర గారి ప్రీతంకి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గా పత్తి కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరకుడు వెంకటయ్య. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పత్తి కుమార్ కు నియామకపు పత్రం అందజేశారు. పత్తి కుమార్ గ్రేటర్ వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఎనుమాముల బాలాజీ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. పార్టీ కార్యకలాపాలలో చెరుకైన వ్యక్తిగా ఉంటూ.. పార్టీకి సంబంధించిన ప్రతీ సమావేశానికి హాజరవుతూ.. కేవలం వర్ధన్నపేట నియోజకవర్గమే గాక, వరంగల్ నగరంలోని గ్రామాల నాయకులతో కార్యకర్తలతో అనేక సందర్భాలలో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై అహర్నిశలు శ్రమిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పత్తి కుమార్ ను గుర్తించి వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గా నియమించింది. ఈ సంధర్బంగా పత్తి కుమార్ అనంతరం మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్క నాయకుడిని కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నటికైనా గుర్తింపునిస్తుందని అన్నారు. తన పై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నగర గారి ప్రీతం , డీసీసీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,నరుకుడు వెంకటయ్య , పదవి రావడానికి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు మిత్రులందరికీ పత్తి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.