- “సేవ్ టైగెర్స్ – సేవ్ నేచర్”, “రోల్ అండ్ ఇంపార్టెంస్ అఫ్ టైగర్ ఇన్ ఎన్ ఎకోసిస్టం” అంశాలపై ప్రతిభా పాఠవ పోటీలు
వేద న్యూస్, హనుమకొండ:
ఈ నెల 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని హంటర్ రోడ్డు, హనుమకొండ లోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో హన్మకొండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఔల్స్ ఎన్.జి.ఓ.) వరంగల్ వారు సంయుక్తంగా పులులపై అవగాహన, రక్షణకై ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఆసక్తిగల పాఠశాల విద్యార్థినీ విధ్యార్థులకు “సేవ్ టైగెర్స్ – సేవ్ నేచర్”, “రోల్ అండ్ ఇంపార్టెంస్ అఫ్ టైగర్ ఇన్ ఎన్ ఎకోసిస్టం” అంశాలపై వకృత్వం, వ్యాసరచన, చిత్రాలేఖనం పై ప్రతిభా పాఠవ పోటీలు ఉ.10:00 నుండి మ.12:00 వరకు జూపార్కులో నిర్వహించనున్నారు.
ఇందుకోసం విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనడానికి జూ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, శ్వేత, మొబైల్ నెం. 9642421300 కు గాని లేదా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ, పిట్టల రవిబాబు, మొబైల్ నెం. 9849425271 కు ఫోన్ చేసి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవలసినిదిగా తెలియచేసారు.
ప్రతిభను కనపరచిన విజేతలను అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున వేదికపైన ప్రకటించి గౌరవ అతిథులు చేతుల మీదుగా బహుమతుల ప్రదా నంతోపాటు మెరిట్ ధ్రువపత్రాలను, పోటీలోపాల్గొన్న మిగతా విద్యార్థిని విద్యార్థులందరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేయనున్నారని ఒక ప్రకటనలో తెలియజేసారు.