వేద న్యూస్, జమ్మికుంట:

మానవుడి శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు కీలకం. కాగా, కిడ్నీల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. అవేంటో తెలుసుకుందాం. 

చాలా వరకు కిడ్నీ రోగాలు చాలా ప్రమాదకరమైనవి.. వాటిని సరైన సమయములో చికిత్స చేయకపోతే, ఆ చికిత్స ప్రభావం కనపడదు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి నయమవ్వలేని రోగములు, వాటి అంతిమ చరనములో చేసే ఉపచారము, డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ ప్లాన్ట్ చాలా ఖర్చుతో కూడిన విషయము. ఈ సౌకర్యాలు అన్ని చోట్ల లభించవు. అందుచేత “ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్” అనే దాని ప్రకారం.. కిడ్నీలు పాడవకుంటే రక్షించుకునే జ్ఞానము ప్రతి వ్యక్తికి ఉండవలసిన అవసరము ఎంతో ఉంది. 

ప్రతి రోజు 3 లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు (10-12 గ్లాసులు) నీళ్లు తాగాలి (ఎవరికైతే శరీరములో వాపు ఉండదో అలాంటి వారికి మాత్రమే).

నియమిత పద్ధతిలో వ్యాయామం చేయడము, శరీరము బరువు హద్దులలో ఉంచడము.

40 ఏండ్ల వయస్సు తర్వాత ఆహారములో ఉప్పు పరిమాణము తగ్గించడము.

పొగ త్రాగడము, కిళ్లీ వేసుకోవడము, వక్కపొడి, సారా (శరాబ్) సేవించడము లాంటి అలవాట్లు మానివేయడము.

వైద్యుని సలహా లేకుండా అనవసరమైన మందులు తీసుకోకుండా ఉండటం ఉత్తమం.