- శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించిన అధిష్టానం
వేద న్యూస్, రాజేంద్రనగర్:
బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఖరారయ్యారు. గురువారం బీజేపీ కేంద్రకమిటీ విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు ఉండటం పట్ల ఆయన వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.