వేద న్యూస్, మరిపెడ:
రేపు(శనివారం)మరిపెడ బస్గాండ్ దగ్గర జనవరి 27న కనకదుర్గ ఫంక్షన్ హాల్లో మరిపెడ మండల స్థాయి చెకుముకి పరీక్షను.. కనకదుర్గ ఫంక్షన్ హాల్, మరిపెడ బంగ్లా లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవిజ్ఞాన వేదిక వారు నిర్వహించే ఈ మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ కు విద్యార్ధులు సమయానికి హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
మరిపెడ మండల పరిధిలోని కేజీబీవీ, టీఎస్ఎంస్, జెడ్పీహెచ్, అన్ని ప్రైవేట్ హై స్కూల్, ఎయిడెడ్ హై స్కూల్ యాజమాన్యాలకు ఈ విషయం తెలుపుతున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.
విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకోవాలని విజ్ఞాన శాస్త్రం అభివృద్ధికి కృషి చేయాలని ఎంఈవో బి.పూల్చంద్, మండల నోడల్ అధికారి అనితా దేవి, సీతారాంపురం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎం.రామచంద్రు, మరిపెడ మండల జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు బయగాని రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి ఊరుకొండ శ్రీనివాస్, చెకుముకి కన్వీనర్ సుభాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఎవరైనా మరిన్ని పూర్తి వివరాలకు రామ్మోహన్ 94412 89274, సుభాన్‌ను 97046 03065 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించొచ్చని సూచించారు.