- నిర్వహణకు రూ.25 వేలు ఆర్థిక సాయం చేసిన సామాజికవేత్త
వేద న్యూస్, కరీంనగర్ :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర పరిధిలోని హైస్కూల్స్ బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ ను హుజురాబాద్ పట్టణం లోని హై స్కూల్ గ్రౌండ్ లోని క్రీడా మైదానం లో శుక్రవారం ప్రముఖ సామజిక వేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్ ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వహణకు రూ.25 వేలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సబ్బని వెంకట్ కు కృతజ్ఞతలు తెలిపారు.
యువతీ యువకులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలని సబ్బని వెంకట్ ఈ సందర్భంగా సూచించారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని వెల్లడించారు.