వేద న్యూస్, వరంగల్:

నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో గణేష్ గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిథిగా పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి హాజరయ్యారు.

మహిళలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంలో దీక్షకుంట మహిళా సంఘాలు ముందుండాలని సూచించారు. అదేవిధంగా వీవో ల ద్వారా స్వయం సహాయక గ్రూపులకు రూ.ఐదు లక్షల చెక్కుల పంపిణీ చేశారు.

అలాగే మహిళా సంఘాలకు జ్యూట్ బ్యాగులను అందించినారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సిసి రవీందర్, వీవోఏ యాకాంబరం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి, దీక్షకుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెరుగు కుమార్ స్వామి, నాయకులు పులి నవీన్, రాంబాబు, కిరణ్ కొండల్ రెడ్డి జక్కుల రాజు గ్రామైక్య సంఘం సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.