వేదన్యూస్ – గాంధీభవన్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బిగ్ షాకిచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలున్నాయి.. నెమళ్లున్నాయి.
లేవని ఎవరూ చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసమైన ఢిల్లీలో ఆయనింట్లో నూ నెమళ్లున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు బుల్డోజర్లతో కంచగచ్చిబౌలి అటవీ ప్రాంతంలో చెట్లను కొట్టేశాము అని అంటున్నారు. కానీ మేము బుల్డోజర్లతో కాదు. జేసీబీలతో అని ఆయన సమాధానమిచ్చారు.
పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో అక్కడ నెమళ్లు.. జింకలున్నాయని ఒప్పుకున్నారు. చెట్లను మొక్కలను కొట్టేశాము అని ఒప్పుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు అక్కడ మొక్కలను కొట్టేయలేదు. జింకలు నెమళ్లు లేవని చెబుతున్న మాటలు అవాస్తవాలే కదా అని ప్రతిపక్షాలు కౌంటర్ అటాకింగ్ లు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లే అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.