• బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం 

వేద న్యూస్, హుజురాబాద్/వీణ వంక :

వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరె రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారు. విజయం తెలుసుకున్న ఘన్ముక్ల గ్రామానికి చెందిన గాజుల హరిత(ట్రాన్ జెండర్)మృతుని కుటుంబాన్ని పరామర్శించి..  ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన వంతు సాయం గా  రూ. 5,000ను మృతుని కుటుంబ సభ్యులకు అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెంండర్ ను పలువురు గ్రామస్తులు అభినందించారు