వేద న్యూస్, మరిపెడ:
డోర్నొకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ను చిన్నగుడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సిందూర రవి నాయక్ అధ్వర్యంలో నాయకులు గురువారం ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ పార్టీ బీపామ్ తీసుకున్న సందర్బంగా రెడ్యా నాయక్ కు నాయకులు బోకే ఇచ్చి శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చి రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు, కౌన్సిలర్స్ బానోతు కిషన్ నాయక్, మచ్చర్ల స్రవంతి భద్రయ్య,లలిత వెంకటేశ్వర్లు, ఊరుగొండ శ్రీనివాస్, కౌసల్య గణేష్, శ్రీను, ఎడెల్లి పరశురాములు, హతిరామ్ నాయక్, బయ్య బిక్షం, సీనియర్ నాయకులు వెంకన్న,, కో ఆప్షన్ సభ్యులు మక్సుద్,దేవరసెట్టి లక్ష్మినారాయణ, హుసేన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, బాలాజీ నాయక్, సయ్యద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్యా నాయక్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.