- ఎన్నికైన నూతన కార్యవర్గం
వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం టియుడబ్ల్యూజే -హెచ్ 143 మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పైడి రాజు, ఉపాధ్యక్షులు చేరాల రాజు, ప్రధాన కార్యదర్శిగా జంగిటి శ్రీనివాస్, కోశాధికారి కోలపురం మహేష్,ప్రచార కార్యదర్శి నాయిని తిరుపతి, సహాయ కార్యదర్శి బొల్లం సాయి రెడ్డి, ముఖ్య సలహాదారులుగా దొడ్ల దేవేందర్, బట్టు శ్రీనివాస్, మామిడి కమలాకర్ లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు బొల్లం పర్శరాములు,జిల్లా కమిటీ సభ్యులు గుర్రాల మెహన్, జిల్లా సహాయ కార్యదర్శి మరియు ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి మహమ్మద్ సలీమ్, కార్యవర్గ సభ్యులు, ఆంజనేయులు, అనిల్, నారాయణ, చందు, శంకర్, పర్శరాములు, ప్రశాంత్,అనిల్ పాల్గొన్నారు.