• మౌలిక వసతులు కల్పించాలి
  •  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వేద న్యూస్, ఇల్లంతకుంట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ లో ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కందికట్కూర్ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం కలెక్టర్ పర్యటించారు.

ఈ సందర్భంగా కాలనీలో నీరు నిలిచి ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. ఈ కాలనీలో సీ సీ రోడ్డు, మురుగు కాలువలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

కాలనీలో కావలసిన అన్ని వసతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటన లో ఎంపీడీఓ శశికళ, శ్రీనివాస్, నాయబ్ తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

టీయూడబ్ల్యూజే-హెచ్ 143 ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా పైడి రాజు