హైదరాబాద్:
నవతెలంగాణ పత్రిక ఎడిటర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాంపల్లి రమేష్ ను పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు శనివారం కలిసారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుడితాడు బాపురావు తదితరులు ఎడిటర్ ను కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, సంఘం కార్యక్రమాలపై చర్చించారు.