Jitan Ram Manjhi

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలైన ముప్పై రెండు ఏండ్ల సుష్మాదేవి తన భర్తలో ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

ఈ హాత్య గురించి సుష్మాదేవి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ ఈరోజు బుధవారం మధ్యాహ్నాం సుష్మాదేవి భర్త రమేష్ పని నుండి ఇంటికి వచ్చాడు. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. గోడవ తీవ్రతం కావడంతో రమేష్ నాటు తుపాకీతో సుష్మాదేవిని దారుణంగా కాల్చారు.బుల్లెట్ శబ్ధం విని మేము పిల్లలం అక్కడకు పరుగెత్తుకోని వచ్చాము.

వచ్చేసరికి రమేష్ పారిపోయాడు. సుష్మాదేవి రక్తపుమడుగులో పడి ఉంది. తన సోదరిని హత్య చేసిన రమేష్ ను కఠినంగా శిక్షించాలి. ఉరి శిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ  ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నిందితుడ్ని పట్టుకోవడానికి స్పెషన్ టీమ్స్ ను ఏర్పాటు చేశాము. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.