- ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఔల్స్) ఆధ్వర్యంలో
- జిల్లా అటవీ శాఖ, జె.ఎస్. భూపాలపల్లి సహకారంతో..
- బీసీ వెల్ఫేర్ హై స్కూల్ లో వనమహోత్సవం
వేద న్యూస్, వరంగల్/మొగుళ్లపల్లి:
అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యం లో ఎం జే పీ మొగుళ్ల పల్లి పాఠశాలలో గురు పౌర్ణమి సందర్భంగా వనమహోత్సవ వేడుకల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గురువులకు పుష్పాంజలులు సమర్పించి, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా గురువుల గొప్పతనాన్ని ప్రతిబింబించారు.

ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి మండల తహశీల్దార్ జె. సునీత, సబ్ ఇన్ స్పెక్టర్ అఫ్ పోలీస్ ఆశోక్, డిప్యూటీ ఆర్ ఓ రత్న జ్యోతి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ(OWLS) వ్యవస్థపక అధ్యక్షులు ఐ. నాగేశ్వర్ రావు సంయుక్త కార్యదర్శి పిట్టల రవి బాబు కార్యక్రమంలో ఈసందర్భానముగా వివిధరకాల మొక్కలను నాటారు.
కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయురాలు ఎస్. శారద అధ్యక్షత వహించారు. అతిథులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. వీటిలో పుష్ప, పండ్ల, నీడనిచ్చే మొక్కలు మరియు ఔషధ మొక్కలు ఉన్నాయి.
ఈ సందర్భంగా శారద మేడం మాట్లాడుతూ.. “గురువులు విద్యార్థుల జీవితాల్లో మార్గదర్శకులుగా ఉండే వారు. అలాగే మన భూమిని పరిరక్షించాలంటే మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది” అని తెలియజేశారు.
ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇందారం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థి దశనుండే పర్యావణ పరిరక్షనను సామాజిక బాధ్యతగా అలవర్చుకొని అడవులను భూగోళాన్ని రాక్షంచుకోవాలని హితవు పలికారు. అలాగే విద్యార్థులచే అడవులు, అటవీ జంతులను రక్షించాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఓరుగల్ల వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి , ప్రముఖ పర్యావరణ వేత్త రవిబాబు మాట్లాడుతూ తమచుట్టూ ఉన్న పర్యావరణాన్ని, అడవులను, అటవీ జంతువులను మరియు సహజ వనరులను రక్షించుకునే ప్రాథమిక బాధ్యత భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 51ఎ/జి కల్పించిందని వివరించారు . మనకు మనపూర్వికులు ఇచ్చినటువంటి ఈ స్వచ్చమైన ప్రకృతి పర్యావరణాన్ని అవసమున్నంత మాత్రమే వాడుకొని రాబోవుతారాలకు ఇదే మంచి ఆరోగ్యాకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని సూచించారు.

చెల్పూర్ ఫారెస్ట్ డైప్యూటీ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ వన్య ప్రాణులను, వనాలను రక్షించుటలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందుండాలని, ఎక్కడైనా అడవి జంతువుల వేట, మాంసము, తినడంగాని, అమ్మడంగాని, జంతు అక్రమ రవాణా, అడవుల నరికివేత చూసిన, తెలిసినా అటవీ అధికారులకు టోల్ ఫ్రీ నంబర్ 1800 4255 364 ద్వారా తమకు తెలియచేయాలనీ కోరారు.
విద్యార్థులలో పర్యావరణ ప్రేమను పెంపొందించడానికి అతిథులు మంచి సందేశాలను ఇచ్చారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొగుళ్లపల్లిలోని బీసీ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ శారద, OWLS NGO వ్యవస్థాపక అధ్యక్షుడు ఇందారం నాగేశ్వర్ రావు, పర్యావరణవేత్త రవి బాబు పిట్టల, డిప్యూటీ R.O., M. రత్న జ్యోతి, చెల్పూర్ రేంజ్, N. రాజు, D. పురుషోత్తం F.B.O. చెల్పూర్ రెంగే, జిల్లా అటవీ అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, M. నవీన్ రెడ్డి IFS మద్దతు మరియు సహకారం అందించారు మరియు కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.



