వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:

కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా వంగ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపల్లిగూడెం సర్పంచ్ తో పాటు 12 వార్డులకు గాను 10 వార్డులు బిఆర్ఎస్ గెలుచుకుంది.

సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో గురువారం  నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని సన్మానించిన అనంతరం రెండుసార్లు వార్డు మెంబర్ గా గెలిచిన వంగ రమేష్ ను బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గెలుపొందిన పాలకవర్గానికి శాలువాలతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.