- ప్రజలకు మెరుగైన కంటి, చెవి, ముక్కు, గొంతు, వైద్య సేవలే లక్ష్యం
- డాక్టర్ వెంకటసాయి నేత్ర నిఖిత దంపతులు
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బీఐ బ్యాంకు పక్కన ‘వేద’ కంటి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిని సోమవారం ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట శాఖ అధ్యక్షుడు డాక్టర్ అంకం సుధాకర్, కార్యదర్శి డాక్టర్ ఊడుగుల సురేశ్ ప్రారంభించారు. 24 గంటల వైద్య సౌకర్యం హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటుందని, గ్రామీణ, జమ్మికుంట పట్టణ, మండల, పరిసర ప్రాంత వాసులందరికీ మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని సదరు ఆస్పత్రి డాక్టర్లు, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి.వెంకట్ సాయి నేత్ర ఎంబీబీఎస్ ఎంఎస్(ఆప్తమాలజీ), చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.నిఖిత దంపతులు వెల్లడించారు.
జమ్మికుంట పరిసర ప్రాంత ప్రజలకు నిపుణులైన ఎంఎస్(ఆప్తమాలజీ), ఎంఎస్(ఈఎన్‌టీ) వైద్యులచే చెవి, ముక్కు, గొంతు కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లు సదరు ఆస్పత్రిలో అందుబాటులోకి రానున్నాయి. ఈఎన్‌టీ, కంటి సంబంధిత పరీక్షలు, వైద్యం కోసం సుదూర ప్రాంతాలు వెళ్లకుండా జమ్మికుంట పట్టణంలోని ‘వేద’ ఆస్పత్రిని సంప్రదించొచ్చని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు.

అత్యాధునిక పరికరాలతో టెస్టులు
‘వేద’ ఆస్పత్రిలో ఆధునిక వైద్య పరికరాలతో టెస్టులు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గత కొన్నేండ్లుగా జమ్మికుంట ప్రాంతవాసులకు ‘నయన’ ఆస్పత్రి ద్వారా మెరుగైన కంటి వైద్య సేవలు అందిస్తు్న్న నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ తిరునహరి సురేశ్ బాబు తనయుడు వెంకటసాయి నేత్ర ఎంబీబీఎస్ ఎంఎస్(ఆప్తమాలజీ) చదివి.. సొంతూరులో తండ్రి అడుగు జాడలో తన వంతుగా సేవామార్గంలో ఆస్పత్రి ప్రారంభించడం పట్ల పలువురు పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

‘వేద’ ఆస్పత్రిలో వెంకటసాయి నేత్ర జీవిత భాగస్వామి డాక్టర్ నిఖిత ఎంబీబీఎస్ ఎంఎస్(ఈఎన్‌టీ) చెవి, ముక్కు, గొంతు వైద్య సేవలను అందించనున్నారు. కాగా, నాన్న అడుగుజాడలో సేవామార్గంలో చక్కటి సేవలందించి వెంకటసాయి ప్రజల్లో చక్కటి పేరు గడించాలని, ప్రజావైద్యుడిగా రాణించాలని, ప్రజా ఆస్పత్రిగా ‘వేద’ ఆస్పత్రి వర్ధిల్లాలని పలువురు శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ తిరునహరి సురేశ్ బాబు, సీనియర్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.