- రంగంలోకి దిగిన ఏఎస్పి
వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
జులై 18, 2025 న వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. “ఏ జే @బెల్ట్ అడ్డా!?” శీర్షిక న వార్తా కథనం ప్రచురితమయింది.
మిల్స్ కాలని పరిధిలో ఉన్న పలు ప్రాంతాలకు సంబంధించిన బెల్ట్ షాప్ ల గురించి ఆరా తీసేందుకు స్వయంగా ఏఎస్పి శుభం ప్రకాష్,మిల్స్ కాలనీ పోలీసులు రంగంలోకి దిగారు.
తెల్లవారులు బెల్ట్ షాప్ లు కొనసాగుతూ.. నిత్యం గొడవలకు కారణం అవుతున్న బెల్ట్ షాపుల నిర్వాహకులకు, ప్రజలకు ఏ ఎస్ పి శుభం ప్రకాష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.