వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:

‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 22న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘కమీషన్ కోసం డీలర్ల ఎదురుచూపులు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమయింది.  

వారంలోపు కమీషన్ ను విడుదల చేయకపోతే సమ్మె చేస్తామని డీలర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి డీలర్ల కమీషన్ రూ. 47.19 కోట్ల జూన్,జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మొత్తం రిలీజ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు నెలల కమీషన్ ను డీలర్ల అకౌంట్లో రెండు రోజుల్లోజమ చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించింది. కమీషన్ కు సంబంధించిన సమస్యకు పరిష్కారం చూపిన “వేద న్యూస్ ” తెలుగు దినపత్రికకు రేషన్ డీలర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘వేద న్యూస్’  దిన పత్రిక ప్రజల సమస్యలను వెలికితీయడంలో, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో  ముందు వరుసలో ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.