వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:

“వేద న్యూస్” తెలుగు దినపత్రిక ఈ నెల 17న తన ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఉన్నతాధికారి  క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. 

” పత్రాలకు భద్రత కరువు!” అనే శీర్షికన ” వేద న్యూస్ ” తెలుగు దినపత్రిక ప్రచురించిన వార్తా కథనానికి ఆఫీసర్లు స్పందించారు. తహసిల్దార్ కార్యాలయాన్ని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ సందర్శించారు. తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

 

తహసిల్దార్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్… సమస్యలను సబ్ కలెక్టర్ కు వివరించారు. ప్ర హరీ నిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేశారు. ప్రహరీ నిర్మాణం కు సర్దుబాటు కాకుంటే ఇంకా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణాన్ని కలియ తిరిగారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి కృషిచేసిన “వేద న్యూస్” తెలుగు దిన పత్రికకు మండల ప్రజలు, రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అం” వేద న్యూస్” పత్రిక ప్రజల సమస్యలు ప్రభుత్వం,అధికారుల దృష్టికి తీసుకపోవడంలో ముందువరుసలో నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.