- మంచి నీటి పైపుల పునరుద్ధరణ
వేద న్యూస్, మడికొండ :
మంచి నీరు వృధాగా పోయి మురుగు కాలువలో కలిసి పోతుండటంతో.. ఈ నెల 22 వ తేదీన “వేద న్యూస్” దినపత్రికలో దీనిపై కథనం ప్రచురించగా, స్పందన వచ్చింది. ఎట్టకేలకు సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది స్పందించి దిగివచ్చి మంచి నీటి పైపుల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.
మిగతా చోట్ల ఉన్న మంచినీటి పైపుల లీకేజీ పనులను కూడా ప్రారంభించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేద న్యూస్ దినపత్రిక కు కృతజ్ఞతలు తెలియజేశారు.
