• వేద న్యూస్ కథనానికి స్పందన..తాగునీటి ప్రదేశం పరిశుభ్రం

వేద న్యూస్, ఎంజీఎం:

గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో తాగునీటి ప్రదేశంలోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న తీరును ‘వేద న్యూస్ తెలుగు దినపత్రిక’ ..“హే.. గాంధీ!.. వరంగల్ ఎంజీఎంలో తాగునీరు కాలకూట విషం!” అనే శీర్షికన ఆదివారం ఉదయం స్టోరీ ప్రచురించింది.

దీనికి ఆస్పత్రి అధికారులు, సిబ్బంది గంట వ్యవధిలోనే స్పందించి పూర్తి స్థాయిలో శుభ్రం చేశారు.

త్రాగునీరు వద్ద అపరిశుభ్రంగా ఉన్న తీరును ఎంజీఎం అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక టీమ్ కు పలువురు అభినందనలు తెలిపారు.