• వేలాది మంది భక్తుల మధ్య మేకపోతును గావుపట్టిన బీరన్నలు

వేద న్యూస్, కరీమాబాద్:

తొలి ఏకాదశి పర్వదినాన ఆదివారం కురుమలు తమ కులదైవమైన బీరన్నస్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు.

 

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉర్సు కరీమాబాద్ లో కనులపండువగా వేడుకలు జరిగాయి. ఉత్సవాల్లో బీరన్నలు నృత్యాలతో అలరించారు.

 

కరీమాబాద్ శ్రీ బీరన్నస్వామి ఆలయం కమిటీ అధ్యక్షుడు కోరే కృష్ణ ఆధ్వర్యంలో మహిళలు బోనాలు సమర్పించారు.

 

 

బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ

బీరన్నలు కరీమాబాద్.. బురుజువద్ద మేకపోతును గావుపట్టగా ఆ సన్నివేశం చూడటానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో జాతరను తలపించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి కొండా సురేఖ పాల్గొని బోనం ఎత్తారు.