- వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య
వేద న్యూస్, వేములవాడ:
వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన హుస్సేన్.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం, వీడియో తీయుటకు ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ అంజయ్య మంగళవారం తెలిపారు.
ఈ మహిళల పట్ల అసభ్యకరం గా వ్యవహరించినా, మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. మహిళ లు వారిపై జరుగుతున్న చర్యలను మౌనంగా భరించవద్దు అని, ధైర్యం గా ముందు కు వచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లలో కానీ జిల్లా షీ టీమ్ కి కానీ కంప్లయింట్ చేయాలని సూచించారు.