•    తప్పెట్ల ప్రగతికి అభినందనలు
  • ఊరి పేరు నిలబెట్టావంటూ యువతికి పలువురి శుభాకాంక్షలు
  • భవిష్యత్తులో మరిన్ని గొప్ప శిఖరాలు అధిరోహించాలని దీవెనలు

వేద న్యూస్, మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వెంకంపాహాడ్ గ్రామానికి చెందిన తప్పెట్ల నాగేష్ స్వర్ణ చిన్న కుమార్తె తప్పెట్ల ప్రగతి మట్టిలో మాణిక్యంలా మెరిసింది. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (2025) ఫలితాల లో కీటక శాస్త్రం, నెమటాలజీ సబ్జెక్టులో ఆల్ ఇండియా తొమిడో ర్యాంకుసాధించింది. ఎస్సీ సామాజిక వర్గ పరిధిలో ఆల్ ఇండియాలో ఆమె  ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. తెలంగాణ రాష్ట్రం తరఫున సదరు విద్యార్థి సత్తాచాటారు.

ఆల్ ఇండియా ర్యాంకు రావడంతో తప్పెట్ల ప్రగతిని పలువురు రాజకీయ నాయకులు, అధికారులు అభినందించారు. ప్రగతి ఊరిపేరు నిలబెట్టి.. ప్రగతి పథంలో మరింత ముందుకు సాగాలని ఊరి ప్రజలు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.

ప్రగతి కుటుంబ సభ్యులు ఆమెకు జాతీయ స్థాయిలో ర్యాంకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఆమె ఉండాలని ఊరి ప్రజలు, పలువురు గ్రామస్తులు, పెద్దలు కోరుకున్నారు.