వేద న్యూస్, మరిపెడ:

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంజె.ఎఫ్. మాదిగ జర్నలిస్టుల ఫోరం మాదిగ జర్నలిస్టులను అందరినీ ఏకం చేసి జాతి ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని మందకృష్ణ ఆదేశించారని, ఆయన  ఆదేశాల మేరకు ఎం. జె. ఎఫ్. మరిపెడ మండల అధ్యక్షులుగా చింత వెంకన్న ను నియమించినట్టు నాయకులు మంగళవారం తెలిపారు.  

ఎం. జె. ఎఫ్. మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ అధ్యక్షులుగా చింత వెంకన్న  కు నియామక పత్రం మహబూబాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు శాగంటి రమేష్ మాదిగ. ఎం. ఎస్ .పి. జిల్లా అధ్యక్షులు పోలేపాక ఎల్లయ్య మాదిగ, సీనియర్ జర్నలిస్ట్ జిన్నా లచ్చయ్య వంకాయలపాటి తిరుమలరావు చేతుల మీదుగా అందజేశారు.

 తనపై నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతను మరింత బలాన్నిచ్చిందని తన ఎన్నిక కు సహకరించిన ఎం. ఎస్. పి .జాతీయ నాయకులు మంద కుమార్ మాదిగ గుగ్గిళ్ళ పీరయ్య  రాష్ట్ర నాయకులకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు.