- ఘనంగా మాజీ ఎమ్మెల్యే జయంతి
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఇందుర్తి మాజీ శాసన సభ్యులు బొమ్మ వెంకటేశ్వర్లు(వెంకన్న) 82 వ జయంతి వేడుకలు ఎల్కతుర్తి మండలకేంద్రంలో నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. బొమ్మ వెంకన్న చిత్రపటానికి పార్టీలకు అతీతంగా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజానీకానికి బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ అజాత శత్రువు అని పేర్కొన్నారు.
బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నాయకులు, బొమ్మ వెంకన్న అభిమానులు పెరుగు మధుసూదన్, అంచనగిరి వెంకటరమణ, కొమ్మిడి శ్రావణ్ రెడ్డి, గొడిశాల వినయ్ గౌడ్, ఘనబోయిన నాగరాజు, దాట్ల సుధాకర్, శనిగరపు సాహూ తదితరులు పాల్గొన్నారు.