వేద న్యూస్, వరంగల్: శ్రీ భద్రకాళి దేవస్థానం ట్రస్టీగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కమటం వేణుగోపాల్‌కు పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిజం రంగంలో గుర్తింపు పొందిన వేణుగోపాల్, దేవస్థానం ట్రస్టీగా నియమితులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ, సమాజ సేవతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమటం వేణుగోపాల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన సేవా ప్రస్థానం మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *