- డీఎస్పీకి అర్హత సాధించిన విజయ్ కుమార్
వేద న్యూస్, మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ 15వ వార్డు ఆర్లగడ్డ తండా కు చెందిన జటోతు విజయ్ కుమార్ గ్రూపు 1 లో రాష్ట్ర 218 ర్యాంకు సాధించి డీఎస్పీ కి అర్హత సాధించారు.
ఆర్లగడ్డ తండా కు చెందిన బీ ఆర్ ఎస్ నాయకులు జాతోతు బాలాజీ భద్రమ్మ ల మొదటి కుమారుడు అయిన విజయ్.. గ్రూప్-1 లో డీఎస్పీ కి అర్హత సాధించడం ఆనందకర విషయమనీ ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గుడిపూడి నవీన్ రావు హర్షం వ్యక్తం చేశారు.
బాలాజీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపి, జటోతు విజయ్ కుమార్ ను శాలువ తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.