- ఎల్బీ కాలేజీలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ‘‘జాతీయ యువజన దినోత్సవం’’ శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపారు. యువతకు ఉజ్వల భవిష్యత్తు కోసం వారు ఏ మార్గంలో వెళ్లాలో దశ, దిశ ఒక బలమైన సంకల్పం కఠినమైన నిర్ణయాలతో ఒక లక్ష్యం వైపు ప్రయాణించాలనేది వివేకానంద సూచించారని చెప్పారు.
యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడుతుందని యువ రక్తాన్ని దేశ అభివృద్ధి కోసం వాడుకోవాలని స్వామి వివేకానంద తెలిపినట్లు గుర్తుచేశారు. తన చిన్న వయసులోనే తన వాక్చాతుర్యంతో తన ఆలోచనలతో ఒక కొత్త ప్రపంచాన్ని ఒక కొత్త యువతతో అభివృద్ధి నిర్మాణం ఎలా ఉండాలో వివేకానంద చెప్పారని స్పష్టం చేశారు. యువతకు ఇచ్చిన ప్రేరణ సూత్రాలు నేడు కొట్లాదిమంది మెదడులో ఉండడం ఎంతో ఆదర్శమని తెలిపారు.
స్వామి వివేకానంద వారి ఆదర్శాలను ముందుకు తీసుకుపోతూ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాలని ప్రిన్సిపాల్ తెలిపారు. జాతీయ యూత్ దినోత్సవం సందర్భంగా ఎన్సిసి క్యారియర్స్ చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి, సిహెచ్ రవీందర్, రాజమౌళి, భాగ్యలక్ష్మి, హాస్య, నిషినూ, విద్య ,సాక్షి, రజినీకాంత్, సాహిత్య, రేణుక శివాని సాహిత్య పాల్గొన్నారు.