- కౌన్సిలర్ గొట్టం లక్ష్మి-మల్లయ్య, బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం
వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మున్సిపల్ 9 వార్డ్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మి -మల్లయ్య, గొట్టం స్వప్న- మహేష్ ఆధ్వర్యంలో 9వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ప్రతీ రోజు ఇంటింటికీ తిరుగుతూ ప్రతీ ఒక్క ఓటర్‌ను కలుసుకుంటూ..తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో మరోసారి రాబోయేది గులాబీ పార్టీ ప్రభుత్వమేనని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికి సంక్షేమాన్ని అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని చెప్తున్నారు. ప్రజల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని జనానికి అర్థమయ్యేలా కౌన్సిలర్, నాయకులు వివరిస్తున్నారు. పెదపల్లి ఎమ్మెల్యేగా మరోసారి గెలిచేది దాసరి మనోహర్ రెడ్డినేనని జోస్యం చెప్తున్నారు.