- మడిపల్లి మాజీ సర్పంచ్ నేరెళ్ల సదానందం గౌడ్
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగారపు సుమలత రఘుబాబు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మడిపల్లి మాజీ సర్పంచ్ నేరెళ్ల సదానందం గౌడ్ అన్నారు.
ఆదివారం మడిపల్లి గ్రామంలోని శాంతినగర్, ఎస్టి కాలనీలలో మడిపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగారపు సుమలత రఘు బాబుకు మద్దతుగా ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మడిపల్లి మాజీ సర్పంచ్ నేరెళ్ల సదానందం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.
అర్హులైన ప్రతి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకం, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం, షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లతోపాటు,బీసీ కుల గణన, రైతు సోదరులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు గురుకులాలలో ఉచిత విద్యతో పాటు స్కాలర్షిప్ సౌకర్యం ఉన్నత చదువులు చదివి విద్యావంతురాలు అయినటువంటి గంగారపు సుమలత రఘుబాబు ను మడిపల్లి గ్రామ సర్పంచ్ గా బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మంత్రి పొన్నం, హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ల సహకారంతో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, వృద్ధులకు, వితంతువులకు మరియు వికలాంగులకు పెన్షన్లు డ్రైనేజీ కాలువల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం, వీధి దీపాల సౌకర్యం, భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్టాపన, శివాలయం నిర్మాణం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన మడిపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కోసం కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొర్నె సంతోష్, ఒగ్గు కుమార స్వామి, అప్పల రవి, అంబాల రాజు,చిన్నవేన రమేష్, గడ్డం రాజిరెడ్డి, వడ్లూరి రాములు తదితరులు పాల్గొన్నారు
