వేదన్యూస్ -ఢిల్లీ
బుధవారం జరిగిన లోక్ సభ సమావేశాల్లో వివాదస్పద వక్ఫ్ (సవరణ)బోర్డు బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దాదాపు పన్నెండు గంటల పాటు సుధీర్ఘంగా సాగిన చర్చలో నిన్న ఆర్ధరాత్రి స్పీకర్ ఓం బిర్లా వక్ఫ్ బోర్డు బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు.
ఈ బిల్లుకు సానుకూలంగా మొత్తం 282 మంది సభ్యులు ఓట్లేశారు. వ్యతిరేకంగా 232మంది సభ్యులు ఓట్లేశారు. మరోవైపు ఈరోజు గురువారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి వెళ్లనున్నది. బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించారు.