వేద న్యూస్, వరంగల్ టౌన్ :  16వ డివిజన్ కీర్తినగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ సర్వసభ్య సమావేశం కీర్తి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో నంద రమేష్‌ను మరోసారి దేవస్థానం కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత పదవీకాలంలో ఆలయ అభివృద్ధికి చేసిన సేవలను ప్రశంసించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నంద రమేష్ మాట్లాడుతూ, తనపై మరోసారి నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు కమిటీ సభ్యుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కీర్తి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, దేవస్థానం కమిటీ సభ్యులు, ఆలయ భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొని నూతన అధ్యక్షుడిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *