వేద న్యూస్, రాయికల్:
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్‌కు చెందిన లక్ష్మీ అనే గర్భిణికి గురువారం పురిటి నొప్పులు రావడంతో రాయికల్ కు తీసుకెళ్తుండగా, రామోజీపేట – భూపతి పూర్ మధ్య గల లో లెవల్ వంతెన పై భారీగా వరద నీరు వచ్చింది. దాంతో స్థానికులు జేసీబీ సహాయంతో గర్భిణిని సురక్షితంగా లో లెవల్ వంతెన దాటించి 108 లో రాయికల్ కు తరలించారు.
