- రూ.50 వేల విలువైన తాగునీటి ప్యూరిఫైయర్, కూలర్ వితరణ
వేద న్యూస్, కరీంనగర్:
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవొద్దనే సదలోచనతో ఓ పూర్వ విద్యార్థి.. తన ఉన్నతికి పునాది వేసిన సంస్థకు తన వంతుగా సాయమందించి.. తన మంచి మనసును చాటుకున్నాడు. వివరాల్లోకెళితే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు విద్యార్థుల తాగునీటి సౌకర్యార్థం కళాశాల పూర్వ విద్యార్థి ముక్కశివకుమార్ రూ.50 వేల విలువగల తాగునీటి ప్యూరిఫైయర్, కూలర్ వితరణ చేశారు. ముక్క శివకుమార్ తనయుడు డాక్టర్ ముక్క శరత్ గారి చేతుల మీదుగా ప్యూరిఫైయర్ సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రమేష్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ రామస్వామి, కళాశాల అధ్యాపకులు ముక్క శరత్ ని అభినందించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ముక్క శివకుమార్‌ను కళాశాల పూర్వ విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని కళాశాల అభివృద్ధికి సహాయం చేయాలని కోరారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది ముక్కా శివకుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా డా.శరత్ మాట్లాడుతూ తాగునీటి వసతిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ కార్తికేయ హాస్పిటల్ లో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఐ క్యూఎస్సీ సమన్వయకర్త డాక్టర్ ఎస్ ఓదేలు కుమా ర్ , అకాడమిక్ కోఆర్డినేటర్, కళాశాల పూర్వ విద్యార్థుల కన్వీనర్ డాక్టర్ కే రాజేంద్రం, సి పి డి సి సభ్యులు అన్వర్, ఈసీ మెంబర్ రంగారెడ్డి,ఇతర అధ్యాపకులు డాక్టర్ కే గణేష్, రాజ్ కుమార్, రవి ప్రకాష్, డాక్టర్ రవి,కిరణ్ కుమార్, ఉమా కిరణ్, మాధవి, సాయి, రమేష్, కళాశాల పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.