వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:

రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం నేపథ్యంతో వేములపల్లి ఎంఈఓ కార్యాలయం నీట మునిగింది. ఎంఈఓ కార్యాలయం గుంతల మయంగా దర్శనమిస్తుంది.

ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే అధికారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ ప్రదేశంలో వర్షపు నీరు చేరడంతో దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు బారినపడే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పారిశుద్ధ్యం వికటించి రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి.. ఎంఈఓ కార్యాలయానికి నిధులు మంజూరు చేసి మట్టి పోయాలని ప్రజలు కోరుతున్నారు.