- భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తామని వెల్లడి
వేద న్యూస్, భూపాలపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం జయశంకర్ భూపాలపల్లి తీన్మార్ మల్లన్న టీం ఎల్లవేళలా పనిచేస్తోందని ఆ టీమ్ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర సత్యనారాయణ రావు కు తీన్మార్ మల్లన్న టీమ్ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని..ప్రజల పక్షాన నిలవాలని కోరుతూ తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసారి కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న టీం మద్దతుగా నిలిచిందని వివరించారు.
తీన్మార్ మల్లన్న టీం యథావిధిగా కొనసాగుతూ..ప్రజా సమస్యలే ఎజెండాగా ఈరోజు నుంచే కార్యక్రమాలు మొదలు పెడుతుందని వెల్లడించారు. గెలుపు, ఓటమి అనేది చూడకుండా నిత్యం తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటారని చెప్పారు. రేపటినుండి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే తీన్మార్ మల్లన్న టీం పనిచేస్తోందని, తనకు సహకరించిన ప్రజలందరికీ..టీం సభ్యులకు రవిపటేల్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గండు కరుణాకర్, పిట్టల వెంకటేష్, సంతోష్ కుమార్, సామల చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.