– వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హామీ
– ఏర్పాట్లపై కలెక్టర్‌కు కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి వినతి
వేద న్యూస్, వరంగల్/కాశిబుగ్గ:
దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యను నాయకులు గురువారం కలిశారు. బతుకమ్మ, దసరా పండుగకు కావలసిన ఏర్పాట్ల గురించి కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా ఉత్సవాలకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, దసరా ఉత్సవ సమితి కన్వీనర్ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, దసరా పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి బాంబుల కుమార్, ఆర్టిఏ మెంబెర్ గోరంటల మనోహర్, గుత్తికొండ నవీన్, ఓం ప్రకాష్ కొలారియా,దుబ్బ శ్రీనివాస్, మార్టిన్ లూథర్, వేముల నాగరాజు, సిద్ధోజు శ్రీనివాస్, రాచర్ల శ్రీనివాస్. మార్త ఆంజనేయులు, రామ యాదగిరి,ములుక సురేష్,కోట సతీష్, వలపదాసు గోపి తదితరులు పాల్గొన్నారు.