- విద్యాలయం ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక రైతు వేదికను ఆకస్మికంగా తనిఖీ చేసి.. జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వెల్లడించారు. బోయినిపల్లి మండలం కొదురుపాక లోని రైతు వేదికలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, కలెక్టర్,ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టోకెన్ పద్ధతి, ఎరువుల పంపిణీ పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,మాట్లాడారు. జిల్లాలో ఆయా పంటల సాగుకు అణుగుణంగా ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ తెప్పిస్తున్నామని స్పష్టం చేశారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు అప్రమంతంగా ఉండాలని తమ మండలాలకు వచ్చే ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించారు.
రైతులు తమకు అవసరమైన ఎరువులు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు,అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా.. ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని ఆదేశించారు.
గ్యాస్ స్టవ్ పైనే వంటలు సిద్ధం చేయాలి
గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఆదేశించారు.
వేములవాడ మండలం చింతల్ ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయం ఆవరణను పరిశీలించారు. విద్యాలయం ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని,ఆదేశించారు.
ఈ పర్యటన లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఏడీఏలు, ఏవోలు,ఏఈవోలు, ఉపాధ్యాయులు,పంచాయతీ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.