వేద న్యూస్, హన్మకొండ / దామెర:
హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ రమాకాంత్ కు జిల్లా పంచాయతీ కార్యదర్శుల తరఫున పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు జనుగాని అశోక్, ప్రధాన కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, జేఏసీ అధ్యక్షులు పూర్ణచందర్, బైరీ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఉమాకేశ్వర్, పరకాల డివిజన్ అధ్యక్షులు మనోహర్,హనుమకొండ డివిజన్ అధ్యక్షులు ఎండీ.రఫీ, కార్యదర్శి శివ, రాజునాయక్, వేణుమాధవ్, ముకుంద శ్రీనివాస్, అనంత రెడ్డి, మధు, వినయ్, బి.భాస్కర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.