వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఆడపిల్ల లేనిది ప్రగతి లేదని, ప్రపంచం, సృష్టి లేదని ది నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ , ఫార్మర్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఆమె గురువారం హన్మకొండ జిల్లా వేలేరు మండలం గొల్లక్రిష్ణ పల్లి గ్రామంలోని కేజివీబి కేంద్ర పాఠశాలలో బాలికా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు భవిష్యత్తుకు దీపికలు అని చెప్పారు.
బాలికలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటు న్నారని., నేల నుంచి నింగి వరకు ప్రతి రంగం లోనూ ప్రతిభా వంతులుగా రాణిస్తున్నారని చెప్పారు. మరోవైపు అంతకు రెట్టింపు స్థాయిలో అణచివేతకు లోనవుతున్నారని తెలిపారు. ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. వీటన్నిటి అధిగమించాలంటే విద్య, దైర్యంతోనే సాద్యం అని పేర్కొన్నారు.
బాలికలకు కేజివిబి పాఠశాలలు ఎంతో ఉపయోగపడతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్’ పేరుతో కార్యక్రమం రూపొందించిందని వెల్లడించారు. గతం కంటే కొంతమేర బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి, పిల్లలను స్కూలు, కాలేజీ చదువులకు పంపిస్తున్నారని చెప్పారు. బాలికల్లో న్యాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయని కానీ, ప్రోత్సాహపరచు వారు కరువు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ బాధ కే జివిబి పాఠశాల లో ఉండబోదని తెలిపారు. ఇక్కడ అన్ని రంగాలలో ప్రోత్సాహిస్తారనిఅని పిల్లలను ఉత్సాహపరిచారు. బాలికల్లో న్యాయకత్వ లక్షణాలు అలవర చాల్సిన బాధ్యత,ఆ దిశగా వారిని చైతన్య వంతులుగా చేయా ల్సిన అవసరం ఉపాధ్యాయు లపై ఉందని టీచర్స్ కి తెలిపారు.
లింగ సమానత్వం,ప్రతిస్పందించే పాఠ్యాం శాలను ప్రవేశపెట్టడం కూడా అత్య వసరం అని అభిప్రాయపడ్డారు. ఇది బాలికలను చూసే దృష్టికోణం మారుతుందని అన్నారు. బాలికల హక్కుల అమలులో కూడా సమాజం చొరవ చూపాలని అన్నారు.
అమ్మాయిల పట్ల సమాజంలో లోతుగా పాతుకు పోయిన మూస ధోరణుల వల్ల చాలా విషయాల్లో వెనకబడిపోతున్నారన్నారు. అందుకే వారిని చదువుతోపాటు మిగిలిన విషయాలపట్ల అవగాహన కల్పిస్తూ ఉండాలని కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహార లోపాలు, రుతుక్రమ పరిశుభ్రత, బాలికల చట్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాలని చెప్పారు.
చదువు పూర్తి అయ్యాక ఉపాధి, నైఫుణ్యాలు కల్పించాలని కుటుంబంలో బాలికలను బరువుగా భారంగా కాకుండా బాధ్యతగా చూస్తే వారి జీవితాలు వృద్ధి లోకి వస్తాయని, సరైన నైపుణ్యాలను, అవకాశాలను బాలికలకు అందిస్తే మరింతగా రాణించి.. సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారని అభిప్రాయపడ్డారు. అదే నిజమైన బాలికా దినోత్సవం అని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.
అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ చూపిన వారికి అతిధుల చేతుల మీదుగా ప్రశంశాపత్రాలు అందించారు. కార్యక్రమం లో కేజివిబి ప్రిన్సిపాల్ సునిత, ఎస్.ఒ స్రవంతి, అంగన్ వాడీ టీచర్స్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.