KTR

వేదన్యూస్ – తెలంగాణ భవన్

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ యూనివర్సిటీకి ఎక్కడ నుండో వచ్చి చదువుకునే వాళ్ళు ఈ నగర భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి అడవులను నాశనం చేయద్దు. యూనివర్సిటీ భూములను లాక్కోవద్దంటూ ధర్నాలు.. ఉద్యమాలు చేస్తున్నారు. మీరు ఇక్కడే పుట్టారు. ఈ నేలపైనే పెరిగారు. మీరు మనిషిగా ఓ పదినిమిషాలు ఆలోచించండి. భవిష్యత్తు తరాల గురించి ఆలోచించండి అని సూచించారు.

మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ “నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నువ్వు ప్రతినిధివనే ఇంగిత జ్ఞానం నీకు ఉందా..?. కొద్దిగా కూడా ఆలోచిస్తున్నావా..?. పైసలు కోసం ఇంతలా దిగజారాలా అని సూటిగా ప్రశ్నించారు. రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తున్నానని చెప్పుకుంటున్నావు. పద్దెనిమిది గంటలు పని చేయడం కాదు పది నిమిషాలు మనిషిలా పని చేయ్.

పద్దెనిమిది గంటలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా.. ఇరవై గంటలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా పని చేయకూ.. ఓ పదినిమిషాలు నిజంగా ఓ మనిషిలా.. ఓ తండ్రిలా.. ఓ వ్యక్తిలా ఆలోచించి పని చేయండి అని సలహా ఇచ్చారు. మీరు చేసే ఘనకార్యాల వల్ల భవిష్యత్తు తరాలు నష్టపోతున్నాయి. మేము అభివృద్ధి అడ్డు కాదు నిలువు కాదు మీరు చేసే ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు అడ్డు అని మరోకసారి ఉద్ఘాటించారు.ఇప్పటికైన సోయిలోకి వచ్చి హెచ్ సీయూలోని మీ ధమనకాండను ఆపండి అంటూ డిమాండ్ చేశారు.