• ఆదివాసి గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు పిలుపు

వేద న్యూస్,  పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి:

ఆగస్టు 9న (శనివారం)  ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన యువతి యువకులు పెద్ద ఎత్తున.. ప్రతి గ్రామంలో జరిగే ఈ సంబరాల్లో పాల్గొని.. జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు కోరారు. గురువారం ఆయన కొమరాడ మండలం కుమ్మరిగుంట పంచాయతీ డ0గ భద్ర గ్రామంలో సంబురాలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. 

అనంతరం రామారావు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకునే విధంగా ప్రసారాలు జరుపుతున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం గిరిజన ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. గిరిజనులకు నట్టదాయకమైన చట్టాలను రద్దు చేయాలని, అలాగే ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ ఆగస్టు 9 ని ప్రభుత్వం ప్రకటించాలని అలాగే గిరిజనులకు 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ ఆగస్టు 9న ప్రకటించాలన్నారు. 

గిరిజన ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఐదవ షెడ్యూల్ ను పకడ్బందీగా అమలు చేయాలని మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ గురుకులం పోస్ట్లు మినహాయింపు ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ 3 స్థానంలో ఏజెన్సీ లో 100% ఉద్యోగ ఉపాధ్యాయనియామక చట్టం చేసి రాజ్యాంగం లోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని గ్రామ సభ పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేసి గిరిజన సాగు పోడు భూములకు 10 ఎకరాలు చొప్పున పట్టాల మంజూరు చేయాలని విన్నవించారు. 

వీటితోపాటు అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని అడిగారు. గిరిజనుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే దిశగా ఇక్కడ పాలకులు ఆలోచించాలని కోరుతూ ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో గిరిజన ప్రతినిధులు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతిజ్ఞ చేయాలన్నారు. 

అలాగే గిరిజన ఓట్లతో గెలిచినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఆదివాసి దినోత్సవాలు సందర్భంగా దింసాల్లో పాల్గొని ఉత్సవాల్లో పాల్గొని జండాల ఎగరేయడంతో పాటు గిరిజన చట్టాలను కాపాడడం కూడా కీలకపాత్ర వహించాలని తెలిపారు. 

ఇలాంటి సందర్భంలో ఆదాని అంబానీ వంటి కార్పోరేట్లకు దాసోహం అవుతూ గిరిజన చట్టాలని కాలరాస్తే భవిష్యత్తు పోరాటాలకు గిరిజనులందరిని సమయత్వం చేసి ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు.  కాబట్టి వెంటనే ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున కేవలం ఒక్కరోజే పండగ కాకుండా గిరిజన హక్కులను కాలు రాసే విధంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన యువకులు సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి పాల్గొన్నారు.