వేద న్యూస్, బ్యూరో:

భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. అలా అడవిలో ఉన్న జంతువులన్నింటిలో ‘‘పులి’’ డిఫరెంట్ ప్లస్ యూనిక్ యానిమల్. ప్రపంచంలో ఉన్న పులులల్లో మూడో వంతు భారతదేశంలోనే ఉండటం విశేషం. భారతదేశ జాతీయ జంతువు కూడా ‘‘పులి’’యే. 2023 వరకు ఉన్న అధికారిక ఎన్‌టీసీఏ(నేషనల్ టైగర్ కంజర్వేషన్ అథారిటీ) లెక్కల అంచనా ప్రకారం భారతదేశంలో 3,682 పులులు ఉన్నట్టు తెలుస్తోంది.

పులిని సాధారణంగా క్రూర జంతువుగా అభివర్ణిస్తారు. కానీ, పులి సాధు జంతువునేనని పర్యావరణ ప్రేమికులు, నిపుణులు వివరిస్తున్నారు. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర అయిన ‘‘పులి’’ ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుందని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పులి ప్రవర్తన సాధారణం కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

అంతర్జాతీయ పులుల దినోత్సవ చరిత్ర

అంతర్జాతీయ పులుల దినోత్సవం చరిత్ర రష్యాలో 2010 సెయింట్ పీటర్స్ బర్గ్ టైగర్ సమ్మిట్ నుంచి ప్రారంభమైంది. భారత్, రష్యా, చైనాతో సహా అనేక దేశాలు పులులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేశాయి. 1915లో ప్రపంచంలో పులుల సంఖ్య లక్ష ఉండేది. కానీ, క్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గ్లోబల్ టైగర్ ఫోరం, వరల్డ్ వైల్డ్‌ లైఫ్ ఫండ్ ప్రకారం ప్రపంచం మొత్తం మీద 6 వేల పులులు మాత్రమే ఉన్నాయట. అంటే మరో వందేండ్లలో 97 శాతం పులులు అంతరించే పోయే ప్రమాదం పొంచి ఉన్నది.

పులి చర్మం, ఎముకలు ఇతర శరీర భాగాలను సంప్రదాయ మెడిసిన్స్ తయారీకి వాడుతారు. వేట, ఆటల కోసం పులులను కొందరు వేటాడుతుండటం, అడవులు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల పులుల సంఖ్య క్రమంగా రోజురోజుకూ తగ్గిపోతోంది. గత నెలలో కర్ణాటకలో ఓ తల్లి పులి, నాలుగు కూనలు మృతి చెందాయి. గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే పులులు మరణించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి వెల్లడించారు. కాగా, పులులకు వేట ముప్పు అయితే పొంచి ఉన్నది. పులి సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పులి వెరీ పవర్ ఫుల్

ప్రపంచంలో పులి రకాల్లో చాలా రకాల జాతులున్నాయి. అందులో ఈ 6 జాతులు ప్రత్యేకం సైబేరియన్, బెంగాల్, ఇండోచైనీస్ , మలయన్, సుమత్రన్, సౌత్ చైనా. ఇక పులి ఆహారచక్రంలో రెండు కాళ్ల మానవుడు లేడని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నాలుగు కాళ్ల జంతువును మాత్రమే పులి దాడి చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

పులి మనిషిపైన సాధారణంగా దాడి చేయబోదు. ఒకవేళ చేస్తే అది వెనక నుంచే చేస్తుందని, అందుకే అడవిలో ఎక్కడా కింద కూర్చకూడోదని, వెనక్కి క్యాప్ ధరించాలని సూచిస్తున్నారు. ఇక పులికి మనిషి ఎదురుపడినపుడు..నిశ్చల స్థితిలో కదలకుండా అలానే నిలబడితే పులి వెళ్లిపోతుందని అటవీశాఖ నిపుణులు వెల్లడించారు. సాధారణంగా పులికి తనకు ఎదురుగా ఉన్న వస్తువు లేదా మనిషి ఏదైనా చూడగానే చాలా పెద్దగా కనిపిస్తుందని, ఒక వేళ దానికి ఆ వస్తువు చలనం కనిపిస్తే అది దాడి చేయడానికి అవకాశాలు ఏర్పడుతాయని వివరిస్తున్నారు.

పులి పంజా చాలా పవర్ ఫుల్.. ఒకసారి పులి పంజా విసిరితే దాని బలం ఒకటిన్నర టన్నుల వరకు ఉంటుందని అంచనా. అంతటి శక్తిమంతమైన పులి పంజాకు ఎదుటి జంతువు ఏదైనా చీలిపోవాల్సిందే. పులి దాని ఆహార లభ్యతను బట్టి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. తను నిర్మించిన సామ్రాజ్యపు కోటగా భావించి సదరు పులి (ఆడ లేదా మగ) తన యూరిన్(మూత్రం) ద్వారా చెట్లకు స్ప్రే చేసి టెరిటరీని కంట్రోల్‌లో ఉంచుకుంటుంది.


ఒకవేళ ఇతర పులి ఏదైనా తన సామ్రాజ్యంలోకి ఎంటరైతే సదరు పులితో భీకర ఫైట్ జరుగుతోందట. ఇక ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వారిదే ఆ సామ్రాజ్యం అన్నట్లుగా పులులు భావిస్తాయి. ఇక అడవులలో ఆహార లభ్యత, పులుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో పులులు అడవి దాటి బయటకు కూడా వస్తున్నట్లు స్వచ్ఛంద పరిశోధక సంస్థలు గుర్తిస్తున్నాయి.

పులి కొమ్ములన్న జంతువులపైన దాడి చేయడానికి జంకుతుంది. ముఖ్యంగా ఎలుగుబంటిపైన దాడి చేయాలంటే భయపడుతుంది. ఎందుకంటే ఎలుగుబంటి తన గోర్లతో పులి నాక్కోలేని ప్రదేశంలో గాయం చేస్తుంది. ఫలితంగా అది ఇన్‌ఫెక్షన్ అయి, పులి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఆడ పులి తన ఆయుర్దయ కాలంలో 24 పులులకు జన్మనిస్తుంది.

అందుకే ఆడ పులి సంరక్షణను అటవీ అధికారులు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా భావిస్తారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.పులి, పిల్లి ఒక్కటేనని..ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీనేనని పరిశోధకులు చెబుతున్నారు. పులిలో రకాలు పెద్దపులి, చీతా(భారతదేశంలో ఇవి అంతరించిపోయాయి), లెపార్డ్ క్యాట్(ఆకు చిరుత), ప్యూమాలు, ఫిషింగ్ క్యాట్, రస్టిక్ క్యాట్, వైల్డ్ క్యాట్, బ్లాక్ పాంతర్లు. ఇలా పులులలో పలు రకాలున్నాయి.

పెద్దపులి విషయానికొస్తే..ఇది చెట్లు ఎక్కలేదు. కానీ, పెద్దపులి చాలా దూరం జంప్ చేయగలదు. అలా అది మాటు వేసి మాత్రమే తన వేటను కొనసాగిస్తుంది. పులి సంభోగ సమయంలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండటం విశేషం. ప్రతీ సంవత్సరం సమాగ సమయం (జూలై1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) 3 నెలల పాటు పులుల సంభోగానికి సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో టైగర్ రిజర్వ్, ఫారెస్ట్ ప్రాంతాల్లో సందర్శనకు అధికారులు అనుమతించబోరు.

ప్రతి పులికి యూనిక్ చారలు

పులి మనిషి కానీ ఇతర ఏదైనా అలికిడి వింటే సంభోగానికి అసలు సిద్ధపడదు. ఆడ పులి అనుమతితో మాత్రమే మగ పులి సంభోగానికి సిద్ధమైతుంది. పులి సాధారణంగా ఏదైనా జంతువుపైన దాడి చేస్తే వెంటనే ఆ జంతువును తినదట. మొదలు మొత్తటి పదార్థాలను భుజిస్తుంది. ఆ తర్వాత ఒక రెండ్రోజులు ఆగి వచ్చి మిగతా పదార్థాలను తింటుంది. ఒకసారి పులి దాదాపు 40 కిలోల మాంసాన్ని తింటుందని అంచనా.

మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారిక లెక్కల అంచనా. ప్రతీ పులికి యూనిక్ చారలు ఉండటం ప్రత్యేకత. ఆ చారలను బట్టి పులుల గణన చేపడుతారని అధికారులు వివరిస్తున్నారు. పులి కాళ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అది చనిపోయినా కూడా కాళ్లతో నిలబడగలుగుతుందట. పులి 300 కిలోల బరువు ఉంటుందని, దాని మెదడు మాత్రం 300 గ్రాములు ఉంటుందని, పులి 6 కి.మీ. వరకు ఈజీగా స్విమ్ చేయగలదని నిపుణులు పేర్కొంటున్నారు. బెంగాల్ టైగర్ రాత్రి వేళలో అరిస్తే 2 కి.మీ. పరిధి మేరకు వినబడుతుందని వెల్లడిస్తున్నారు.

One thought on “‘వేద న్యూస్’ ప్రత్యేకం.. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘పులి’”

Comments are closed.